తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఐకేపీ వీవోఏ సీఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… వీవోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించి, అనంతరం ఏవో కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ బ్రతుకులు బాగుపడుతాయి అనుకుంటే గ్రేడింగ్ విధానంతో పని భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ రోజు గ్రామాల్లో పని చేసే వీవోఏలు అందరు నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబలకు చెందిన వారే ఉన్నారు. అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. కుంటాల కుమార్, దుర్గం రాములు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధికి తొడ్పాడే వీవోఏల పట్ల ప్రభుత్వ విధానాలు విడనడాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. అబ్బోజు రమణ సీఐటీయు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… ఈ రాష్ట్రములో ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పెంచిన ప్రభుత్వం వీవోఏలకు జీతాలు పెంచక పోవడం చాలా దారుణం, నిరుపేదలైన వివోఏలకు డబుల్ బెడ్ రూం, ఇండ్ల స్థలలు ఇవ్వాలి. జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి.
రాష్ట్రంలో వీవోఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి, వారికి కనీస వేతనం 26వేలు చెల్లించాలి. లేకుంటే వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుందన్నారు. అర్హులైన వీవోఏలను సీసీ లుగా ప్రమోట్ చేయాలని తదితర సమస్యలు పరిష్కరించే విదంగా, ప్రభుత్వం సమ్మె విరామింప చేయాలని లేని యెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఈ పోరాటం ద్వారా చెప్తామని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామిండ్ల రాధిక, లింగంపల్లి వెంకటేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, పొట్ట పోషం జిల్లా కోశాధికారి, జిల్లా ఉపాధ్యక్షులు రమాదేవి జి.రజిత, బుట్ల అనిత, జిల్లా సహాయ కార్యదర్శులు పి.మహేష్, రజిత, సురేష్, జిల్లా సలహా దారులు జుమ్మిడి లక్ష్మణ్ తుకారాం, దాసు జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకటేష్, టీ.సమ్మన్న, భాగ్యలక్ష్మి, గౌరీ, స్వరూపరాణి లక్ష్మి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.