Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala: ఫిష్ ఫెస్టివల్ వచ్చేసిందోచ్

Manchiryala: ఫిష్ ఫెస్టివల్ వచ్చేసిందోచ్

తెలంగాణా ప్రభుత్వం మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని చేపలు తినే వారి కోసం ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. చేపల ద్వార వివిధ రకాలైన ఆహార ఉత్త్పత్తులు వాటి నుంచి వచ్చే పోషక విలువలు వివిధ రకాల రుచులను పరిచయం చేసేందుకు వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా జూన్ 8,9,10 తేదీలలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో “ఫిష్ ఫెస్టివల్” నిర్వహించనున్నట్లు మత్స్యశాఖ సంఘాలకు సభ్యులు, అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ మూడు తేదీలలో పది స్టాల్స్ లో వివిధ రకములైన, రుచి కరమైన చేపలు, రొయ్యల వంటలు చేసి అమ్ముతారు. అనుభవం కలిగినవారు, ఔత్సాహికులు తమ వంటల నైపుణ్యం ద్వార వివిధ రకములు తయారు చేసి ప్రదర్శించుటకు జిల్లాలోని ప్రజలకు మత్స్యశాఖ ఒక సువర్ణ అవకాశం కలిపిస్తోందని జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందస్తుగా మత్స్యశాఖ కార్యాలయం నందు దరఖాస్తులు జూన్ 2 తేదిలోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్.ఐ.టి.హెచ్.ఎమ్ నందు శిక్షణ పొందిన మహిళలు, మహిళా మత్స్యకారులు, మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల వారు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, ఆసక్తి గల స్ట్రీట్ ఫుడ్ వెండోర్స్ ఈ కార్యక్రమం ద్వార వివిధ రుచులతో పాటు, ఉపాధి అవకాశం కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News