Sunday, July 7, 2024
HomeతెలంగాణManchiryala: గవర్నర్ తమిలిసైకి జన్మదిన శుభాకాంక్షలు

Manchiryala: గవర్నర్ తమిలిసైకి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తమిళిసై సౌందర్య రాజన్ జన్మదినోత్సవ వేడుక కార్యక్రమాలను హైదరాబాద్ రాజ్ భవన్ దర్బార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 1969 సంవత్సరము తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను గవర్నర్ తమిళిసై స్వయంగా శాలువాతో ఘనంగా సత్కరించి మోమెంటులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై తన జన్మ దినోత్సవము సందర్భమున కేక్ కట్ చేసి అతిథుల ఆశీర్వాదాలను స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ పాట్రన్ మెంబర్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి వి.మధుసూదన్ రెడ్డి గవర్నర్ కార్యాలయ ఆహ్వానం మేరకు స్వయంగా పాల్గొని శాలువా మరియు బొకే బహూకరించి మంచిర్యాల జిల్లా తరఫున రాష్ట్ర అవతరణ, జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరాలను స్వయంగా గవర్నర్ గారికి తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ (రిటైర్డ్), కార్యదర్శి మదన్మోహన్రావు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కోటిరెడ్డి, పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News