తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, బైపాస్ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, జిల్లా బిఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా|| బాల్క సుమన్. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, కార్యమాలల్లో పాల్గొన్న కళాబృందాలకు ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం విప్ బాల్క సుమన్ ప్రసంగిస్తూ… ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించే దిశగా అంబేడ్కర్ సూచనలే మార్గదర్శకంగా దేశం గర్వించ దగ్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అముచేస్తుందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలు, మహనీయుల ఆకాంక్షల స్ఫూర్తిగా మంచిర్యాల జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల తో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాలనాధికారి బాదావతంతోష్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలతో జోహార్లు అర్పించారు. జిల్లాలో అమలువుతున్న సంక్షేమ ప్రగతిని వివరించారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తూ రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, ఋణమాఫీ, రైతు వేదికల నిర్మాణం చేపట్టి అనేక సంస్కరణలు చేపట్టాం. జిల్లాలో 2016లో 1,37,887 ఎకరాల విస్తీర్ణంలో పంటసాగు ఉండగా 9 ఏళ్లలో 4,45,429 ఎకరాలకు పెరిగిందని బాల్క్ సుమన్ అన్నారు.