Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: పోలీస్ కమిషనరేట్ లో హోలి

Manchiryala: పోలీస్ కమిషనరేట్ లో హోలి

ప్రజలకు, అధికారులు హోలి శుభాకాంక్షలు తెలిపారు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ… హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని నింపి, రంగులమయం చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ సంబరాల్లో పాల్గొని పోలీస్ అధికారులకు సిబ్బంది ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, జైపూర్ ఎసిపి నరేందర్, పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్, స్పెషల్ బ్రాంచి ఏసిపి మోహన్, సిసిఎస్ ఏసీపీలు వెంకటేశ్వర్లు, ఉపేందర్, ఏ.ఆర్.ఎస్. సి.పి లు సుందర్ రావు, మల్లికార్జున్, సిసి ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, కమిషనరేట్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు, రామగుండంకమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News