Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం చేయండి

Manchiryala: కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం చేయండి

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గని ఆవరణలో ఫిట్ సెక్రెటరీ మేండే వెంకటి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ కార్మిక సంఘాలు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా చట్టపరిధిలో నిర్ణయం తీసుకొని కారుణ్య నియామకాల ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. నేడు 16 వేల మంది యువకులకు ఉద్యోగాలు లభించాయన్నారు. తెలంగాణ రాకుంటే సింగరేణి ప్రాంత యువకులు అధోగతి పాలయ్యేవారన్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి గనులు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. 10వ వేతనం 20 శాతం పెరిగితే, 11వ వేతనం 19 శాతం పెంచారని చెప్పారు. అన్ని అలవెన్స్ లకు ఫ్రీజింగ్ చేశారని ఆరోపించారు. పెన్షన్ పెరుగుదలపై కనీసం జాతీయ సంఘాలు మాట్లాడకుండా మౌనం పాటిస్తుందని వారు ఆరోపించారు. ఈ నెల 9న నస్పూర్ లో నిర్మించిన మంచిర్యాల నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని, పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నస్పూర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్మికులు, కార్మిక కుటుంబాలు, కారుణ్య ఉద్యోగాలు పొందిన యువకులు పెద్దసంఖ్యలో తరలివాలని పిలుపునిచ్చారు. సీఎం బహిరంగ సభకు ప్రజలు సమ్మక్క, సారలమ్మ జాతరను తలపించేలా తరలివచ్చి కుంభమేళాలా జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు ఢీకొండ అన్నయ్య, మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిది వెంగళ కుమారస్వామి, ఆర్కే-7 గని ఫిట్ సెక్రెటరీ మేండే వెంకటి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు తొంగల రమేశ్, రౌతు సత్యనారాయణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ ప్రేమ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ వంగ తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, రాజేంద్రపాణి, మోతే కనకయ్య, పాణిగంటి సత్తయ్య, వడ్లకొండ రవి, రఫీ ఖాన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News