Tuesday, September 10, 2024
HomeతెలంగాణManchiryala: యుపిహెచ్సి కేంద్రంను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్

Manchiryala: యుపిహెచ్సి కేంద్రంను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ బి. రవీందర్ నాయక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో జిల్లాలో నస్పూర్ దీపక్ నగర్ యుపిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి వైద్యులు వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు వైద్య సిబ్బంది వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నందున సమయ పాలన పాటించి అందుబాటులో ఉండాలని ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని ప్రజలలో నమ్మకాన్ని కలిగించాలని అందరిని ప్రేమపూర్వకంగా వైద్య సేవలు అందించాలని మందులు అన్ని అందుబాటులో ఉంచుకోవాలని ప్రభావిత గ్రామాల ప్రాంతాలలో వైద్య శిబిరంలు ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ మున్సిపల్ ఐసిడిఎస్ ఇతర డిపార్టుమెంటులతో సత్సంబంధాలు పెంచుకోవాలని సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సమయ పాలన పాటిస్తూ ప్రజలలో నమ్మకం కలిగించాలని ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ల్యాబ్ లలో పరీక్షలు ఫార్మసీ దగ్గర మందులు సూపర్వైజర్ సిబ్బంది ఆశలు ఆరోగ్య కార్యకర్తలతో సమన్వయం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో ముందంజలో ఉండాలని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న జిల్లా వైద్యాధిక శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ఈ రెండు ఆరోగ్య కేంద్రాలలో అందిస్తున్న సేవల పైన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని దానికోసం ప్రజలతో కలిసినప్పుడు ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలియజేయాలని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దోమల ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి పాఠశాలల్లో ఐకెపి గ్రూపులలో తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ అనిత, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ సుచరిత డాక్టర్ శివ ప్రతాప్ డాక్టర్ మానస, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు, విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా మాస్ మీడియా బుక్క వెంకటేశ్వర్, ఆరోగ్య సిబ్బంది ప్రశాంతి డిపిఎమ్ఓ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News