Monday, December 4, 2023
HomeతెలంగాణManchiryala: ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

Manchiryala: ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

మంచిర్యాలలో ప్రత్యేక కార్యక్రమాలు

జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు విప్ బాల్క సుమన్. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో గల ఐడిఓసి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భాగంగా మహనీయుల చిత్రపటాలకి పూలమాల సమర్పించి అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ రాహుల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతి రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News