జిల్లాలో రైస్ మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి, రైస్ మిల్లుల యజమానులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. జిల్లాలోని లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలలోని బాయిల్డ్, పారా బాయిల్డ్ రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని బాయిల్డ్, పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్ఆర్ఎం ఇండస్ట్రీస్, గాయత్రి పారాబాయి రైస్ మిల్, శివరామకృష్ణ ట్రేడర్స్, శ్రీరామచంద్ర పారాబాయి రైస్ మిల్, శ్రీరామ పారాబాయి రైస్ మిల్, రత్న గర్భ రైస్ మిల్, శివ సాయి ఈపి రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లులలోని రిజిస్టర్లు, ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైస్ మిల్లర్లు అందరూ సిఎంఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఆయా రైస్ మిల్లుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.