Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala: స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

Manchiryala: స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

శాసనసభ నియోజకవర్గ సాధారణ ఎన్నికలు-2023లో భాగంగా నవంబర్ 30వ తేదీన జిల్లాలోని చెన్నూర్ ఎస్సి., బెల్లంపల్లి ఎస్.సి., మంచిర్యాల నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ అనంతరం ఈ నెల 1వ తేదీన నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి. ప్యాట్లను జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి తరలించి స్ట్రాంగ్రూమ్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచి సీల్ వేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్, పోలీసు పరిశీలకులు ఆర్.ఇలంగో, బెల్లంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి స్థానిక సంస్థలు బి.రాహుల్, జిల్లా అదనపు పాలనాధికారి రెవెన్యూ సబావత్ మోతిలాల్, మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, చెన్నూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు, మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాములులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల
ప్రతినిధుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారిగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగడం ఎన్నికల అధికారుల కృషి, రాజకీయ పార్టీల సహకారంతో సాధ్యపడిందని అన్నారు. ఈ నెల 3న జరిగే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేందుకు కృషి చేయాలని, ఈ నెల 5వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News