Tuesday, September 17, 2024
HomeతెలంగాణManchiryala: వరిధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా చూడండి

Manchiryala: వరిధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా చూడండి

జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎ.ప్రేమ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 2022-23 యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మద్దతు ధర చెల్లించి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం
కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి 2 వేల 60 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 40 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కొరకు 57 లక్షల 16 వేల గన్నీ సంచులు అవసరం కాగా 18 లక్షల 8 వేల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, గన్నీ సంచుల సరఫరాదారుల ద్వారా 20 లక్షల గన్నీ సంచులు తీసుకోవడం జరిగిందని, మిగిలిన 19 లక్షల 8 వేల గన్నీ సంచులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు వేసవికాలం దృష్ట్యా త్రాగునీరు, నీడ ఇతర మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు వివరించారు.

- Advertisement -

కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులు తాలు, మట్టిగడ్డలు లేకుండా నిబంధనల ప్రకారం వరిధాన్యాన్ని తరలించాలని తెలిపారు. రైతుల సౌకర్యార్థం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నం.6303928682 ను ఏర్పాటు చేయడం జరిగిందని, సందేహాలు, సలహాల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News