Friday, November 22, 2024
HomeతెలంగాణManchiryala: VOAల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

Manchiryala: VOAల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

IKP VOA ఉద్యోగుల సంఘం (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని తాపీ మేస్త్రి సంఘం భవనం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడి చేసి అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఐకేపీ వీవోఏ సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీవోఏలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 2 నెలల క్రితం నుండి సెర్ఫ్ సిఈఓ, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించక పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. జిల్లా, మండలాల అధికారులు సమ్మె చేస్తున్న వీవోఏలను విధుల నుండి తొలగిస్తామని బెదిరింపులకు గురిచేయడం ఆపాలన్నారు. సమస్యలపై పోరాడే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది, రాజ్యాంగ హక్కులను కాలరస్తే ఊరుకోం, వీవోఏల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలి అందరికి వేతనాలు పెంచిన ప్రభుత్వం వీవోఏలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏ సీఐటీయు జిల్లా అధ్యక్షులు కుంటాల కుమార్ మాట్లాడుతూ… మేము గత 36 రోజులు నుండి మండల కేంద్రాల్లో సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం. మా బాధలు ప్రభుత్వం దృష్ఠుకి పోవాలని ఎండ అనక వాన అనక మేము పోరాటం చేస్తున్నాం. మామ్మల్ని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ భద్రత, 10 లక్షలు ప్రమాద భీమా సౌకర్యాలు కల్పించాలి. ఇప్పటికైనా రాష్ట్ర సెర్ఫ్ సిఈఓ, రాష్ట్ర మంత్రులు మమ్మల్ని చర్చలకు పిలవాలి సమస్యలు పరిష్కారం చేయాలి. లింగంపల్లి వెంకటేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ… గ్రామాల్లో మహిళలు అభివృద్ధి కొరకు నిరంతరం కష్టపడుతున్న వివోఎలము కనీస వేతనం అడగటం తప్పా…? మా బతుకులు మార్చేది ఎవరు, మేము మనసులమే కదా మాకు కనీస వేతనం ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం…? ఆన్లైన్ పనులు రద్దు చేయాలి. గ్రేడింగ్ విధానంతో మమ్మల్ని మానసికంగా ఇబ్బందులు గురిచేయడం వలన చాలా మంది వీవోఏలు అనారోగ్య బారిన పడుతున్నారు. రమాదేవి, రజిత, అనిత జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… గ్రామాల్లో మహిళలను ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధికి తొడ్పడి వారికి బ్యాంకు లింకేజి నుండి లోన్స్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరం రోడ్డు మీదకు వచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిరించడం సరైంది కాదు. ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం ఉంటే వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి. గత కొన్ని సంవత్సరాలుగా సభ్యులకు రావాల్సిన అభయహస్తం డబ్బులు వెంటనే చెల్లించాలి. గ్రామ సంఘాలకు పక్క భవనాలు నిర్మించాలి. సెర్ఫ్ నుండి ఐడి కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలి. మాసమస్యలపై రాష్ట్ర మంత్రులు చర్చలకు పిలిచి పరిష్కరం చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ సెర్ఫ్ ఆఫీస్ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్ట పోషం జిల్లా కోశాధికారి, అన్వార్, అలీమ్, సురేష్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు, తుకారాం, దాసు, జిల్లా సలహా దారులు అన్ని మండలాల వీవోఏలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News