Thursday, September 19, 2024
HomeతెలంగాణManchiryala: అభివృద్ధిలో సంక్షేమంలో మేమే ముందు

Manchiryala: అభివృద్ధిలో సంక్షేమంలో మేమే ముందు

మందమర్రి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ మైదానంలో మందమర్రి పట్టణ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. నిర్వహిస్తున్న సమ్మేళనంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మీయ సందేశంను సభలో చదివి వినిపించారు. అనంతరం మందమర్రి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సభలో వివరించారు. 172.35 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు, 1/70 యాక్ట్ (షెడ్యూల్ ఏరియా) నుండి మందమర్రి పట్టణాన్ని మినహాయింపు ఇచ్చి ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చూడాలి. 1/70 యాక్ట్ 50% పైగా గిరిజనులు, ఆదివాసులు, కొండ ప్రాంతాల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నపుడే అమలు చేయాలని బురియా కమిటీ పార్లమెంట్ కు సిఫార్సు చేసిందన్నారు. మందమర్రిలో 2.68% మాత్రమే ST లు నివసిస్తున్నారు. 1/70 యాక్ట్ వల్ల జీవో 76,58,59 అమలు చేయలేక పోతున్నాం. భవన నిర్మాణానికి అనుమతులు రావు. బ్యాంకు లోన్లు రావు. మున్సిపల్ ఆదాయం రాక అభివృద్ధికి పనులకు ఇబ్బంది. ప్రజా ప్రతినిధులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 1/70 యాక్ట్ అమలు చేసి కాంగ్రెస్, బీజేపీలు పట్టణాన్ని చావు దెబ్బ కొట్టి ఓట్లు ఎలా అడుగుతారు. వ్యాపార,వర్తక, వాణిజ్య, రంగాల్లో పట్టణం అభివృద్ధి చెందాలి. కేంద్రం సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేసి సింగరేణికి కేటాయించాలి. సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలి. సింగరేణి నల్ల బంగారం – యావత్ తెలంగాణ కొంగుబంగారం. సింగరేణి సంస్థ కాదు ఇక్కడ జీవన విధానం. వంద సంవత్సరాలకు పైగా ప్రజలతో పెనవేసుకున్న బంధం. నాలుగు బ్లాకుల వేలంతో మొదలుపెట్టి ప్రైవేటీకరించే కుట్ర. గుజరాత్ లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా అప్పగించారు. గుజరాత్ కు ఓన్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ లాగా సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించి సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే కుట్ర.

- Advertisement -

గతంలో కాంగ్రెస్, బీజేపీలు వారసత్వ ఉద్యోగాలు పోగొడితే.. తెలంగాణ ప్రభుత్వంలో 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించినం. సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే ఇకపై కారుణ్య నియామకాలు ఉండవు. సింగరేణి ధర్మల్ విద్యుత్ కేంద్రం మరియు రాష్ట్రంలోని రెండు వేలకు పైగా పరిశ్రమలకు బొగ్గును అందిస్తుంది. సింగరేణి ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరిస్తుండటంతో సంస్థపై అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇది సింగరేణి వేలం కాదు.. కార్మికుల భవిష్యత్తుని బహిరంగ మార్కెట్లో వేలం వేయడం. ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను నిలదీయండి. సంఘాలకు అతీతంగా కార్మిక సోదరులు కలిసి రావాలి. సింగరేణికి – ప్రైవేట్ వాళ్లకు బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుంది. ప్రైవేటు మాఫియా వారు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తారు. కార్మికుల రక్షణకు, పర్యావరణానికి ప్రైవేట్ మాఫియా ప్రాధాన్యత ఇవ్వవు. కొత్త గనులు రావు. వారసత్వపు ఉద్యోగాలు ఉండవు. గనులు మూతపడితే ఉద్యోగం నుండి తొలగిస్తారు. కార్మిక హక్కులు, బోనస్ లు, అలవెన్స్ లకు గండి కొడతారు. దేశ సంపద ప్రైవేటు చేతుల్లోకి వెళితే వారు మాత్రమే అభివృద్ధి చెందుతారు. సింగరేణి సంస్థ కనుమరుగవుతుంది. సింగరేణి సంస్థకు ప్రభుత్వపరంగా 29 శాతం ఇంక్రిమెంట్లు, వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నటీ లీవ్ ఐఐటీ ,ఐఐటి హలో సీటు సంపాదించిన కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, ఇల్లు కట్టుకునే వారికీ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచితంగా ఎలక్ట్రిసిటీ.. సింగరేణి క్వార్టర్లు, డ్యూటీ లో చనిపోయిన కార్మికుడికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 61 పెంచాము, వారసత్వ ఉద్యోగాలలో కొడుకులు లేని వారికి కూతుళ్ళకి అల్లుళ్లు కూడా ఉద్యోగాలు ఇచ్చాం. 500 కోట్లతో మందమర్రి మండలంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అభివృద్ధి యజ్ఞం కొనసాగుతుంది. విపక్షాల కుట్రలను, దుష్ప్రచారాన్ని త్రిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమ్మేళనంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, బిఆరెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ నారదాసు లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News