Tuesday, September 17, 2024
HomeతెలంగాణManchiryala: ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి

Manchiryala: ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి

మే 12న ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని ఆధునిక నర్సింగ్ సేవలకు గుర్తింపుగా ప్రపంచ నర్సుల దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. నర్సులు, వారి కుటుంబాలకు మనం ఎంతో రుణపడి ఉన్నామని తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోరాడే నర్సుల సేవలు అభినందినీయమని ప్రశంసించారు. ప్రపంచం ఆరోగ్యంగా ఉండేందుకు నర్సులు 24 గంటలు అవిశ్రుతంగా శ్రమిస్తారని కొనియాడారు. శుక్రవారం రోజున ప్రపంచ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి లయన్ వి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మలబార్ గోల్డ్ మంచిర్యాల శాఖ మేనేజర్ రోషన్ లాల్ సహాయ సహకారాలతో పట్టణములోని గోదావరి రోడ్డు లో ఉన్న మాతా శిశు కేంద్రంలో వివిధ కేటగిరీలకు సంబంధించిన 12 మంది సీనియర్ నర్సులను ఘనంగా సత్కరించడం జరిగింది. ముందుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలను అలంకరించి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీష్మ, డాక్టర్ వేదవ్యాస్ ప్రొఫెసర్, లయన్ వి మధుసూదన్ రెడ్డి, మలబార్ గోల్డ్ మంచిర్యాల శాఖ మేనేజర్ రోషన్ లాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అరుణ, ఉమామహేశ్వరి నర్సింగ్ సూపర్డెంట్ పాల్గొని శాలువాతో ఘనంగా సత్కరించి వారికి మొమెంటోను అందజేయడం జరిగింది. తదుపరి సిస్టర్స్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. సన్మాన గ్రహీతలు; ఉమామహేశ్వరి, భాగ్యలక్ష్మి, పద్మ, రాజ్యలక్ష్మి,నరేష్, స్రవంతి, మంజు కుమారి, పద్మజ, సుజాత, సంధ్యారాణి, అరుణ,డోర్కా రాణి. ఈ కార్యక్రమంలో భారతి, ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ స్టాప్, ప్రేమ్ కుమార్ సింగ్, పున్నం తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News