Saturday, January 18, 2025
HomeతెలంగాణMohan Babu: మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు ఫిర్యాదు..!

Mohan Babu: మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు ఫిర్యాదు..!

మోహన్ బాబు ఫ్యామిలీలో చెలరేగిన గొడవలు.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రోజు రోజుకీ ఆస్తి గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇటీవల తిరుపతిలోని మోహన్ బాబు కళాశాల వద్ద జరిగిన గొడవ మరువక ముందే.. మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా తన ఆస్తులకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని.. వాళ్లను వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

గత కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు. జల్‌పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్‌పల్లిలో ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్‌కు నోటీసు ఇచ్చారు. దీనిపై మనోజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణును ఉద్దేశిస్తూ.. మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కలిసి కూర్చొని మాట్లాడుకుందామని.. తాను ఒక్కడినే వస్తానని.. ఎక్కడికైనా వస్తాను.. ఎవర్నో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం తనకు తెలిదని.. నాన్నని, మహిళ, సిబ్బందిని అడ్డం పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం లేదని అందులో పేర్కొన్నాడు. అంతేకాదు సమస్యని ఒక పరిష్కారం తీసుకొని వద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. అయితే మనోజ్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మోహన్ బాబు ఈ విధంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News