బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవితక్క పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసిస్తూ బీఅర్ఎస్ పార్టీ మహిళ నాయకులు నిరసనకు దిగారు. మందమర్రి పట్టణంలోని మార్కెట్, అంబేద్కర్ సెంటర్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసి..ఖబర్దార్ అంటూ బండిని హెచ్చరించారు. బండి సంజయ్ డౌన్ డౌన్ నినాదాలు చేసి, కవితక్కకు బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలంతా కలిసి మందమర్రి పోలీస్ స్టేషన్ స్థానిక ఎస్ఐకి బండి సంజయ్ మీద పిటీషన్ ఇచ్చారు.