Tuesday, September 10, 2024
HomeతెలంగాణManikkam Tagore: రేవంత్ పై సీనియర్లదే పై చేయి..ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం

Manikkam Tagore: రేవంత్ పై సీనియర్లదే పై చేయి..ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు . దీంతో.. మాణిక్కం ఠాగూర్ ను తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా తప్పించాలని తెలంగాణ సీనియర్లు రేవంత్ వర్గంపై పైచేయి సాధించి, తమ డిమాండ్ నెరవేర్చుకున్నట్టైంది. నిజానికి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించటానికి రాకముందే తనను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించాలని హై కమాండ్ ను కోరారు మాణిక్కం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఇద్దరినీ తప్పించాలని టీ కాంగ్ సీనియర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా అధిష్టానం ఇంతకాలం పట్టించుకోలేదు. కానీ ఇది ఎలక్షన్ ఇయర్ కావటంతో హై కమాండ్ లో కదలిక వస్తున్నట్టు కనిపిస్తోంది.

- Advertisement -

‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో ఎప్పటికప్పుడు సీనియర్లు రేవంత్ వర్గంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైకమాండ్ కు పంటి కింద రాయిలా మారాయి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ‘పచ్చ కాంగ్రెస్’, ఓల్డ్ గార్డ్స్ తో కూడిన ‘సేవ్ కాంగ్రెస్’ వర్గాన్ని బుజ్జగించి, ఇద్దరినీ సమన్వయం చేయగలిగిన సత్తా ఉన్న నేతనే కొత్త ఇంఛార్జ్ గా త్వరలో రాష్ట్రానికి రానున్నారు. అయితే ఇది ఎవరనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంఛార్జ్ ని నియమించక తప్పని పరిస్థితి నెలకొన్నాయి. ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమానికి సైతం మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలు హాజరు కాకుండా తమ అలకను చూపటంతో టీకాంగ్ లో భగ్గుమంటున్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News