దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan singh)కి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సంతాప తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలని.. మంచి ప్రదేశంలో ఆయన విగ్రహం పెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దేశాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన తీరును రేవంత్ ప్రశంసించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ కృషిని కొనియాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయకత్వమే అన్నారు. ఉపాధి హామీ, ఆర్టీఐ, ఆధార్ లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిది అని కొనియాడారు. సరళీకృత విధానాలతో భారత్ ప్రపంచంతో పోటీ పడేలా చేశారని.. దేశానికి విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఈతరంలో మన్మోహన్ సింగ్‌తో పోటీపడేవారే లేరని చెప్పుకొచ్చారుతెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయకత్వమే అన్నారు.