Saturday, November 23, 2024
HomeతెలంగాణManoharabad: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

Manoharabad: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పోందాలని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ఆన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం, రంగాయిపల్లి గ్రామంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని, రైతులకు అనేక సంక్షేమ పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతు పక్షపాత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల ప్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుధాకర్, సర్పంచులు నరసయ్య, నాగభూషణం, ఎంపీడీవో యాదగిరి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డి, ఎపీఎం పెంట గౌడ్, నాయకులు మహేందర్ గౌడ్, శ్రీహరి గౌడ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News