క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాలీబాల్ ఆడి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి, క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి స్నేహపూర్వకంగా ఆడుకోవాలన్నారు. గెలిచినవారు ఓడిన వారిని హేళన చేయకుండా స్నేహ పూర్వకంగా క్రీడా స్ఫూర్తితో మెలగాలని, నిర్వాహకులు క్రీడాకారులకు సహకరించాలని సూచించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. సమైక్య పాలనలో క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా యువత దృఢంగా తయారవుతారని ఇటువంటి క్రీడలు ఎల్లప్పుడూ నిర్వహించిన తాను ప్రోత్సహిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ పురం నవనీత రవి, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి, తూప్రాన్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.