మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వీవోఏలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. వీవోఏల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి అంటూ మండుటెండలో ఎండ వేడిని తట్టుకుంటూ పిల్లాపాపలతో ఆరవ రోజు నిరవధిక సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేపీ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీవోఏలకు 10 లక్షల సాధారణ బీమాతో పాటు ఆరోగ్య బీమా సౌకర్యాన్నికల్పించి, ఐడీ కార్డులను ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేని పక్ష్యంలో సమ్మెను మరింత ఉద్రితం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు అవుతున్నా ఐకేపీ వీవోఏల బ్రతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి అనురాధ, దీప, నవనీత, కల్పన, అనసూయ, అమృత, లక్ష్మి, హేమలత, సునంద, వాణి, సంధ్య, కవిత తదితరులు పాల్గొన్నారు.