Monday, December 9, 2024
HomeతెలంగాణMaoists | ఇన్‌ఫార్మర్లంటూ… గొడ్డలితో దారుణంగా చంపేశారు

Maoists | ఇన్‌ఫార్మర్లంటూ… గొడ్డలితో దారుణంగా చంపేశారు

ములుగు జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను నరికి చంపారు. ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర అలజడి సృష్టించింది. మృతదేహాల పక్కనే మావోయిస్టులు ఒక లేఖను సైతం విడిచి వెళ్లారు. మావోయిస్టుల ఘాతుకంతో మృతుల బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

- Advertisement -

స్థానిక సమాచారం ప్రకారం… వాజేడు మండలం పెనుగోలు కాలనీలో గురువారం రాత్రి పోలీసులకు ఇన్‌ఫార్మర్లని ఆరోపిస్తూ మావోయిస్టులు (Maoists) ఇద్దరు వ్యక్తులను నరికి చంపారు. మృతులిద్దరూ మావోయిస్టుల సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఎలైట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన SIBకి అందజేస్తున్నారని, అందుకే హత్య చేసినట్లు పేర్కొంటూ మృతదేహాల దగ్గర ఏరియా కార్యదర్శి ‘శాంత’ సంతకంతో మావోయిస్టులు లెటర్ వదిలి వెళ్లారు.

హత్యకు గురైన వారిని ఉయికా రమేష్, ఉయికా అర్జున్‌గా గుర్తించారు. రమేష్ వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో పెనుగోలు కాలనీ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News