బిజెపి, కాంగ్రెస్ బానిస బ్రతుకుల సంకెళ్ల నుండి విముక్తి చేసి కెసిఆర్ ప్రధానమంత్రి కావాలని మహారాష్ట్ర నుండి హైదరాబాద్ ప్రగతి భవన్ వరకు మహారాష్ట్ర వాసులు పాద యాత్ర చేపట్టిన తీరు అద్వితీయమైన రామగుండం ఎమ్మెల్యే చందర్ అన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర నుండి ప్రగతి భవన్ వరకు మహారాష్ట్ర వాసులు మస్కే బాబురావు, మాస్కే శోభరాణిలు చేపట్టిన పాదయాత్ర రాజీవ్ రహదారి గుండా సింగరేణి బి గెస్ట్ హౌస్ వరకు చేరడంతో వారిని ఎమ్మెల్యే చందర్ కలిసి స్వాగతం పలికి పూల బొకే అందించి, శాలువాలతో సన్మానించారు. మస్కే బాబురావు, శోభారాణి మెడలో, చేతులకు సంకెళ్లు వేసుకొని కాంగ్రెస్, బిజెపి పాలనలో బానిసలుగా ఉన్నామంటూ ప్రదర్శన చేస్తూ ప్లెక్సీ పట్టుకొని పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా కాంగ్రెస్, బిజెపి పరిపాలనలో రైతులు బానిసలుగా ఉన్నారని, వచ్చేది రైతు ప్రభుత్వమేనని, మహారాష్ట్రలో, దేశంలో బిఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పాదయాత్ర హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభేషెక్ రావు, బిఅర్ఎస్ నాయకులు నూతి తిరుపతి, కాంపెళ్ళి సతీశ్, చల్లా రవీందర్ రెడీ, కలువల సంజీవ్, కేక్కర్ల సతీశ్ బాబు గౌడ్, అయిల్లా నాగరాజు, బాను చందర్, జెవి రాజు, వేణు, నీరటి శ్రీనివాస్, కార్పొరేటర్లు దోంత శ్రీను, అడ్డాల గట్టయ్య, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర సందర్బంగా పలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బిఅర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు.