సనత్ నియోజకవర్గంలో కమలం జెండా ఎగురవేస్తామని బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తనకు అవకాశం కల్పించడం గౌరవంగా ఉందన్నారు. పార్టీ శ్రేణలతో కలిసి పార్టీని గెలిపిస్తామని చెప్పారు. ప్రజల ఆశీస్సులు తనపై ఉన్నాయని అన్నారు. బీజేపీ కి కార్యకర్తలే బలమని, వారి సహకారం తనకు కొండంత ధైర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా నాయకుడు శ్యామ్ సుందర్ గౌడ్, కార్పొరేటర్లు కేతినేని సరళ, కొణతం దీపిక, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Marri Sasidhar files nomination: నామినేషన్ దాఖలు చేసిన మర్రి శశిధర్ రెడ్డి
సనత్ నగర్లో కమలం జెండా ఎగురవేస్తాం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES