Thursday, July 4, 2024
Homeతెలంగాణcongress party : మర్రి శశిధర్ పై సస్పెన్షన్ వేటు

congress party : మర్రి శశిధర్ పై సస్పెన్షన్ వేటు

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 6 ఏళ్ల పాటు శశిధర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ కు ముందే.. తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు సంకేతంగా తన ట్విట్టర్ ఖాతా నుండి కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించారు శశిధర్ రెడ్డి.

- Advertisement -

శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మర్రి శశిధర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు అదే పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిపై శశిధర్ రెడ్డి కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధ పడుతోందని, ఆ క్సాన్సర్ ఇప్పట్లో నయమయ్యే అవకాశం లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని, తనతోపాటు మరికొందరు నేతలు బయటకు వస్తున్నట్టు తెలిపారు.

మూడురోజులుగా ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నా.. తొలుత అలాంటిదేమీ లేదన్నారు. ఆ తర్వాత బండి సంజయ్, డీకే అరుణలతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన అమిత్ షా తో భేటీ అయ్యారు. పార్టీ మార్పు పై జరుగుతున్న ప్రచారానికి ఈ భేటీ బలం చేకూర్చింది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News