మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు బయలుదేరారు. వరంగల్ జిల్లా నలుమూలల నుండి మూట ముల్లె సర్దుకుని పిల్లాపాపలతో హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన జాతర బస్టాండ్లలో చేరుకున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారికి ఆయా బస్టాండ్ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలను సంబంధిత శాఖ అధికారులు కల్పించారు. ముఖ్యంగా తాగునీరు, టాయిలెట్స్ పారిశుధ్యం నిర్వహణలో చక్కగా నిర్వహించడం కనిపించింది. బస్సుల్లో ప్రయాణించే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం దానికి సంబంధించి మహిళల్లో ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే అనుమతి ఇవ్వడం జరిగింది. ఇటు ఆర్టిసి అధికారులు అటు పోలీసు సిబ్బంది మున్సిపల్ శాఖ అధికారులు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను, భద్రతను కలిగించారు. వారి సేవలను చూసి భక్తులు హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు.