Saturday, April 12, 2025
HomeతెలంగాణMedipalli Sathyam: గెలుపు మాదే

Medipalli Sathyam: గెలుపు మాదే

10 ఏళ్లు ఓడిపోయినా ప్రజల కోసం పోరాటం చేశా

చొప్పదండిలో గెలిచేది తానేనని కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం విశ్వాసం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా పార్టీలో భారీ ఎత్తున చేరికలు సాగాయి. రామడుగు మండలం రంగసాయిపల్లి సర్పంచ్ సాదు పద్మ మునీందర్ రెడ్డి, చొప్పదండి మండలం దేశాయిపేట్ గ్రామ ఎంపీటీసీ కూకట్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కనకం జక్కన్న, బిఆర్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, యువకులు, గంగాధర మండలం బూరుగుపల్లి, లింగంపల్లి, చర్లపల్లి (ఎన్), మధురనగర్ గ్రామ బిఆర్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, యువకులు.. దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మేడిపల్లి సత్యం.

- Advertisement -

రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినా గత పది ఏళ్లుగా చొప్పదండి నియోజకవర్గం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాను. ఒక్కసారి ఆశీర్వదించి ఓటు వేస్తే అభివృద్ధి చేసి చొప్పదండి నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, వన్నెల రమణారెడ్డి, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, చిలువేరి నారాయణ, బొమ్మరవేణి తిరుపతి, దొంగ ఆనంద్ రెడ్డి, దుబ్బాసి బుచ్చయ్య, పుల్కం నరసయ్య, పురం రాజేశం, కర్ర సత్య ప్రసన్న, కోల రమేష్,ముద్దం తిరుపతి,వీర్ల నర్సింగరావు, బండపల్లి యాదగిరి, నర్సింగ్ బాబు, సత్తు కనకయ్య, కర్ర విద్యాసాగర్ రెడ్డి, రోమాల రమేష్, హన్మంతు ,గంగన్న ,సుధాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News