Saturday, November 15, 2025
HomeతెలంగాణMeenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు స్వాగతం పలికిన పీసీసీ చీఫ్

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు స్వాగతం పలికిన పీసీసీ చీఫ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇంఛార్జ్‌గా ఎంపికైన మీనాక్షి నటరాజన్‌(Meenakshi Natarajan) తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. సాదాసీదాగా రైలులో వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఇతర నాయకులు కండువా కప్పి స్వాగతం పలికారు. మరోవైపు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.

- Advertisement -

అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, తదితరులు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad