Singareni Job Mela: నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వందల సంఖ్యలో కంపెనీలు అభ్యర్థులను నియమించుకున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగుల సైతం అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సింగరేణి ప్రాంత యువతీయువకుల కోసం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే..
సింగరేణి ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నవంబర్ 16న మెగాజాబ్ మేళా నిర్వహించనున్నారు. కొత్తగూడెం క్లబ్ (RTC బస్టాండ్ పక్కన) ప్రాంగణంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఉద్యోగ మేళా ప్రారంభం అవుతుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారథ్యంలో ఈ మెగా జాబ్ మేళా జరుగుతుంది.
ఈ మెగా మేళా ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 50కి పైగా ప్రముఖ ప్రైవేటు కంపెనీలు మేళాలో పాల్గొననున్నాయి. దాదాపు 3 వేలకు పైగా ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు
ఆసక్తి గల అభ్యర్థులు 10వ తరగతి (SSC), ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (P.G), డిప్లొమా, హోటల్‌మేనేజ్‌మెంట్, ఎంబీఏ, ఎంసిఎ, ఎంసిఎస్, బీఫార్మా, ఎంఫార్మా, బఇ, బిటెక్, ఎం.టెక్, బిఎ, బీఎస్సీ, బీకామ్ తదితర అన్ని రకాల విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు సంబంధిత సర్టిఫికెట్లతో ఈ మేళాలో పాల్గొనవచ్చు. ట్రాన్స్‌జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.
దరఖాస్తు విధానం
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం తమ బయోడేటా జిరాక్స్, విద్యార్హత డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. ఈ మేళాలో ప్రతి అభ్యర్థి కనీసం 5 కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. తమకు నచ్చిన రంగంలో ఉద్యోగాన్ని పొందాలని సూచించారు.
సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా – యువతకు సువర్ణావకాశం !
సింగరేణి ప్రాంత యువతీ యువకుల కోసం
హైదరాబాద్‌కు చెందిన పలు ప్రైవేట్ కంపెనీల సహకారంతో
సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో మెగా జాబ్ మేళా
ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది.ఆసక్తిగల… pic.twitter.com/GTlPfN0y4f
— Singareni _Official (@PRO_SCCL) November 10, 2025


