Telangana Mega Job Mela: రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 25న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 150కి పైగా కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ఈ మేళాలో నిర్వహించిన ఇంటర్వ్యూలో విజయం సాధించిన దాదాపు 5000 మందికి ఉద్యోగం లభించనుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/kcr-maganti-sunitha-jubilee-hills-bypoll-b-form-brs/
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (DEET) సహకారంతో ఈ మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఐటీ, ఫార్మా, ఇ-కామర్స్, ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీఈఎస్, బీపీఓ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ మెగా జాబ్‌లో పాల్గొనవచ్చు. సూర్యాపేట జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
అర్హతలు: కనీసం పదవతరగతి ఉత్తీర్ణత నుంచి ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, MBA, B.Tech, PG, ఫార్మీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయసు వయసు 18-40 ఏళ్లలోపు ఉండాలి. పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక హూజుర్ నగర్ పట్టణంలో అక్టోబర్ 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏదైనా సహాయం కొరకు 91-9000937805, +91 9848997050, +91 9848409466 ఈ నెంబర్లను సంప్రదించవచ్చు.


