Wednesday, November 12, 2025
HomeతెలంగాణChiranjeevi: హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ని కలిసిన మెగాస్టార్‌ చిరంజీవి.. కారణం అదే?

Chiranjeevi: హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ని కలిసిన మెగాస్టార్‌ చిరంజీవి.. కారణం అదే?

Megastar Chiranjeevi: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం హైదరాబాద్‌లోని నూతన పోలీస్ కమిషనర్‌ (సీపీ) వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సజ్జనార్‌కు పుష్పగుచ్ఛం అందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

గతంలో సజ్జనార్ సైబరాబాద్ సీపీగా పనిచేసిన సమయంలో, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో, వీరిద్దరూ కలిసి చేసిన సామాజిక సేవ, ప్లాస్మా దానం అవగాహన కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇద్దరు ప్రముఖులు ఒకరినొకరు కలుసుకోవడం, సామాజిక బాధ్యత పంచుకోవడం పట్ల సినీ, పోలీస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మెగాస్టార్‌ లైనప్‌లో భారీ చిత్రాలు:

సినిమాల విషయానికి వస్తే, 68 ఏళ్ల చిరంజీవి ఏ మాత్రం వెనుదీయకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ భారీ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనుంది.

దీనితో పాటు, దర్శకుడు వశిష్ఠతో కలిసి చేస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ సినిమా 2026 ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీలో సందడి చేయనున్నారు. ఈ విధంగా మెగాస్టార్ తన అభిమానులకు వినోదాల విందు అందించడానికి సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad