నియంత ఎమ్మెల్యేను ప్రజాక్షేత్రంలో ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుండి తప్పనిసరిగా పోటీలో ఉంటా అని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు పట్టణంలో వల్లభరెడ్డి పంక్షన్ హల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో పార్టీ మారానని, నీతి నిజాయితీతో ఇన్నాళ్లు బతికానని 2009లో కొల్లాపూర్‌లో డిపాజిట్ రాని వ్యక్తి గొప్ప నాయకుడినని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. 2014 ప్రచారంలో కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నాయకులు ముసలి ఎద్దులు అని, వారికి ఓటు వేసి ప్రయోజనం లేదని ఆయన ప్రచారం చేశారని గుర్తు చేశారు.
2018లో అభివృద్ధి చేస్తారని నమ్మిన వనపర్తి నియోజకవర్గ ప్రజలు పాలు పోసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పామై మనల్నే కాటేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్లుగా పెబ్బేరు మండల ప్రజలు సంతపై ఆధారపడి ఉన్నారని, అలాంటి సంతను గద్దలా కబ్జా చేశారని గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించి నాయకుల మధ్య తగాదాలు పెడుతున్నారని అన్నారు.
నియంత ఎమ్మెల్యేను ప్రజాక్షేత్రంలో ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు..గురువుగా భావించే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరి విలువలు పోగొట్టుకున్నారని అన్నారు. శిష్యుడు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌కు సాగునీరు అందిస్తే బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించామని గొప్పలు చెప్పుకునే నాయకులు వారితోనే ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రానివారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ వస్తే ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పథకాలను వివరించారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా నాకు ఖరారు అయ్యిందని, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ టికెట్టును మాజీ మంత్రి చిన్నారెడ్డికి ఇచ్చారు. ఆయన గెలిచే పరిస్థితులు లేవన్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, అధిష్టానం పరిస్థితులను పూర్తిస్థాయిలో తెలుసుకొని నాకు అవకాశం ఇస్తుందన్న అన్ననమ్మకంతో ఉన్నానని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పరిస్థితులను గమనించకుండా తనకు అవకాశం కల్పించకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రెబల్ గా పోటీలో ఉంటానని మెఘారెడ్డి స్పష్టం చేశారు. మెఘారెడ్డి పోటీలో ఉంటే వనపర్తి నియోజకవర్గంలో రసవత్తర ఎన్నికల పోరు జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారని ఆయన అన్నారు.