ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. ఈమేరకు గ్రూప్ I, II & IV ఉద్యోగ నియామకాల కోసం మూడు నెలల పాటు ఫ్రీ-ఎగ్జామినేషన్ ఫౌండేషన్ కోర్సు స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామ్ లాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన గ్రూప్ I, II & IV ఉద్యోగ నియామకాల కొరకు (100) మంది షేద్యుల్డు కులాల నిరుద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు టి.ఎస్.పి.ఎస్.సి. వారు ప్రకటించిన అర్హతలు కలిగి ఉండలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక గ్రాడ్యుయేట్ డిగ్రీలో వారి మార్కుల (మెరిట్) ఆధారంగా ఉంటుందని తెలియజేశారు. అభ్యర్థి కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3లక్షలు కలిగి ఉన్నవారు అర్హులు. కావున జిల్లాలోని అర్హులైన ఎస్సీ యువత నుండి దరఖాస్తులు 17-01-2023 నుండి 31-01- 2023 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకొనవలని వెల్లడించారు. దరఖాస్తు ఫారం “www.tsstudycircle.co.in” లో ఉంది. ఇతర వివరముల కొరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం, నాగర్ కర్నూల్ ఫోన్ నంబరుకు 08540 295566 సంప్రదించగలరు.