Monday, November 25, 2024
HomeతెలంగాణMekala Kavya: జవహర్ నగర్ మేయర్ నిర్వాకం, పదవి కోసం పార్టీలు

Mekala Kavya: జవహర్ నగర్ మేయర్ నిర్వాకం, పదవి కోసం పార్టీలు

పబ్బుల్లో పార్టీలు

మేయర్ హోదాలో ఉంటూ మహిళా, పురుష కార్పొరేటర్లకు పబ్బుల్లో పార్టీలు ఇస్తూ, ఫోటోలకు ఫోజులిస్తూ జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మళ్లీ మేయర్ పదవిని చేజిక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా విచ్చలవిడిగా విందుల పేరుతో పబ్బుల్లో కార్పొరేటర్లకు మందు, బిర్యానీలు, ఖరీదైన లిక్కర్ హుక్కా లాంటి విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఎరగవేసి కార్పొరేటర్ లను లోబర్చుకునేందుకు మేయర్ మేకల కావ్య చేస్తున్న కుటిల యత్నాల పట్ల మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు రాజకీయ మేధావులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

గత నాలుగు సంవత్సరాలుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని మేయర్ తన స్వార్ధపూరిత వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలాసవంతమైన జీవితం గడిపేందుకు గతంలో కార్మిక శాఖా మంత్రిగా కొనసాగిన మల్లారెడ్డి పూర్తి సహాయ సహకారాలతో 2000 గజాల ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో పాటు బినామీ పేర్ల మీద కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్పా ప్రజా ప్రయోజనాల కోసం ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని మళ్లీ మేయర్ పదవిని కైవసం చేసుకోని అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు విచ్చలవిడిగా కార్పొరేటర్ల కొనుగోలు కార్యక్రమాలు చేపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News