Saturday, November 15, 2025
HomeతెలంగాణViral Video: వామ్మో.. ఇదేం ట్రెండ్‌ గురూ.. వాయినంగా బీర్లు.. ఎక్కడో తెలుసా?

Viral Video: వామ్మో.. ఇదేం ట్రెండ్‌ గురూ.. వాయినంగా బీర్లు.. ఎక్కడో తెలుసా?

Men festivals With Bottles: తెలంగాణలో ఓ కొత్త రకమైన ఆచారం ఇప్పుడు ట్రెండీగా మారింది. “మగవారి వాయినాలు” అనే కొత్త ఆచారంపై అంతటా చర్చ నడుస్తోంది. మగవారు తమ స్నేహితుల మధ్య ఒకరికొకరు బొట్లు పెట్టుకొని, కండువలు కప్పుకుని, మద్యం బాటిళ్ళతో వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కొత్తగా స్టార్ట్‌ అయ్యింది. తొలుత ఈ ఆచారం నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలో మొదలవ్వగా.. క్రమంగా పక్క గ్రామాలకు సైతం వ్యాపించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పురాణ సంప్రదాయాల ప్రకారం, ప్రధానంగా ఆడవారికి వ్రతపూజలు, వాయినాలు ఇవ్వడం ఉండేది. వదినా మరదళ్లు గాజులు వాయినాలుగా ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం ఉండేది. కానీ, ఇప్పుడు పురుషులు కూడా ఈ ఆచారాన్ని అనుసరించడంతో అంతా అవాక్కవుతున్నారు. ఇటీవలి కాలంలో పురుషులు తమ స్నేహితులను పిలుచుకొని వాయినాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఈ కార్యక్రమంలో చాపలు పర్చడం, టవల్ కప్పడం, బొట్లు పెట్టడం వంటి సంప్రదాయాలను కూడా పాటిస్తున్నారు. ఈ కొత్త పద్దతిలో మగవారు బీర్లు, క్వార్టర్లతో వాయినాలు అందిస్తూ, పండగను ఆనందంగా జరుపుతున్నారు. ఈ ట్రెండ్ తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా నిర్మల్ జిల్లా ప్రాంతంలో పాపులర్‌గా మారింది. దీంతో వైన్ షాపులు, గాజుల షాపుల్లో మస్తు గిరాకీ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ వాయినాల వీడియోలు వైరల్ ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. అయితే, మగవారి వాయినాలు అనే కొత్త సంప్రదాయం కొందరికి నవ్వులు తెప్పిస్తుంటే, మరికొందరు ఈ సంప్రదాయాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌గా మారుతున్నాయి.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/national-news/tejashwi-yadav-announces-rjd-to-contest-all-assembly-seats/

తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోన్న ట్రెండ్‌..

కాగా, ఒకపుడు వదిన మరదళ్ల గాజులు, మనవరాలు అమ్మమ్మ గాజులు, అన్నచెల్లెళ్ల కుడుకలు ఇలా కొత్త కొత్త ఆచారాలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేకమైన మాసాల్లో మాత్రం ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలామంది మహిళలు శ్రావణమాసంలో వ్రతాలు చేసుకుని వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం అనాదిగా వస్తోంది. అయితే వీటిలో మగవారికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. వారి పని.. పూజల పేరుతో అయ్యే ఖర్చులు పెట్టుకోవడం.. ఆడవారు పూజలు చేస్తుంటే చూస్తూ ఉండటమే. అయితే ఆడవారికే సంప్రదాయలు ఎందుకు అనుకున్నారేమో కానీ.. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలోని పురుషులు ఈ కొత్త రకమైన వాయినాల పద్ధతిని అవలంబిస్తున్నారు. అయితే అసలు దేవుళ్లకు తమ ఇంటి మహిళలు పూజలు చేస్తున్నారు కాబట్టి.. తాము తమ ఆనందం కోసం వెరైటీగా బీర్లు, మద్యం సీసాలతో వాయినం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. స్నేహం బ‌లంగా ఉండాల‌నే ఆకాంక్ష‌తో ఈ కొత్త రకమైన ఆచారాన్ని అనుసరిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడీ ట్రెండ్‌ తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad