మెట్ల చిట్టాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 498 మరియు 506 లలో ఇండస్ట్రియల్ పార్క్ మరియు ఇథనాల్ పార్క్ ఏర్పాటుకి ప్రభుత్వ ప్రభుత్వ ప్రయత్నాలకి వ్యతిరేకంగా గ్రామస్థులు మెట్ పల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామస్థులతో పాటు అఖిలపక్షానికి చెందిన నాయకులు కంతి మోహన్ రెడ్డి, జగిలి సునీత, సురభి నవీన్ రావ్, కొమిరెడ్డి కరం, పుప్పాల లింబాద్రిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడ్డ బడుగు, బలహీన వర్గాలకి చెందిన రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచినట్టే ఇచ్చి, ఫ్యాక్టరీల ఏర్పాటు పేరిట తిరిగి లాక్కోవడం దారుణం అన్నారు.
పట్టాదారులకు కనీసం ఎలాంటి నోటీసులు, సమాచారం లేకుండానే వారి భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేస్తూ, స్వాధీనం చేసుకోవడమంటే పేదల పొట్టకొట్టడమే అన్నారు. అనంతరం ఆర్డీవో వినోద్ కుమార్ కి రైతులు, పట్టాదారులతో కలసి వినతి పత్రాన్ని అందించారు.