Sunday, July 7, 2024
HomeతెలంగాణMinister Jagadish Reddy: చరిత్రకు ఆధారం ఫోటో

Minister Jagadish Reddy: చరిత్రకు ఆధారం ఫోటో

ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు

చరిత్రకు ఆధారం ఫోటో అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రెస్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. మాటల్లో చెప్పలేని భావం ఫోటోలో కనిపిస్తుందన్నారు. ఒక్క ఫోటో ఎన్నో మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అవార్డుకు ఎంపికైన యాకయ్య(సాక్షి), సైదిరెడ్డి (నమస్తే తెలంగాణ), బ్రహ్మచారి (ఆంధ్రప్రభ )లతో పాటు లక్ష్మణ్, బిక్షం, పురుషోత్తంలను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ప్రముఖ లాయర్ సోమ భరత్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News