శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి జానారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జై వీరారెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా SLBC టన్నెల్ కుప్పకూలి బురదలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరం సాగుతున్నాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బురదలో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక కార్మికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరంతరం సమీక్షిస్తున్నారు.


