Saturday, November 15, 2025
HomeతెలంగాణKomati Reddy family: కోమటి రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం.. గోపాల్ రెడ్డి సతీమణి మృతి

Komati Reddy family: కోమటి రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం.. గోపాల్ రెడ్డి సతీమణి మృతి

Komati Reddy Manjula rani death: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి మంజుల రాణి ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో వారి సమీప బంధువు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఎల్బీనగర్ లోని గోపాల్ రెడ్డి నివాసంలో మంజుల రాణి భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. లోటస్ ల్యాప్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ప్రభుత్వ లెక్చరర్ గా ఆమె సమాజ శ్రేయస్సు కోసం చేసిన సేవలను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు.

- Advertisement -

మంజుల రాణి ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తన సమీప బంధువు గోపాల్ రెడ్డిని మంత్రి వెంకట్ రెడ్డి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. కోమటి రెడ్డి మంజుల రాణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad