విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీనిపై మంత్రి కొండా సురేఖ( Konda Surekha) ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇది మా అన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వల్లే సాధ్యమైందని తెలిపారు.
‘నేడు తెలంగాణలోని బీసీలందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చిన శుభదినం.. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం హర్షణీయం. ఇది మా అన్న, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వల్లే సాధ్యమైంది. ఈ బిల్లు ఆమోదం పొందటం యావత్ దేశానికి ఆదర్శం. ఈ నిర్ణయాన్ని యావత్ బీసీ బిడ్డలంతా స్వాగతిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా యావత్ తెలంగాణ సరైన ప్రాతినిథ్యంలేని వర్గాలు వారి ఆకాంక్షలు నెరవేర్చే సందర్భంలో వారి ఆలోచనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రివర్గ సహచరులను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెప్పాను’ అని రాసుకొచ్చారు.