Wednesday, October 2, 2024
HomeతెలంగాణVanaparthi: వనపర్తి దిశా దశా మార్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

Vanaparthi: వనపర్తి దిశా దశా మార్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

అభివృద్ధికి చిరునామాగా వనపర్తి

వనపర్తి అభివృద్ధి ప్రదాత వనపర్తి దిశా దశ మార్చిన గొప్ప వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని బారసా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 23 అంశాలను ప్రారంభం చేయడానికి ఈనెల 29న వనపర్తికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారని అన్నారు.వనపర్తి నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించినందువలన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నడు లేనటువంటి అభివృద్ధిని అధునాతనమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నూతనంగా ఏర్పాటు కాబోతుందని, 50 సంవత్సరాల చరిత్రలో వనపర్తికి టౌన్ ఆడిటోరియం లేదని ఆరు కోట్లతో గొప్ప ఆడిటోరియం ఏర్పాటు చేసుకోబోతున్నామని అన్నారు. నిరుద్యోగ కల్పన కోసం నిరుద్యోగం పాల దోయడం కోసం మంత్రి నిరంజన్ రెడ్డి కృషితో ఐటీ టవర్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అదేవిధంగా ప్రజల రవాణా కొరకు బైపాస్ రోడ్డు ను 84 కోట్లతో ప్రారంభించడం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ పేరు మీద ఒక కాలనీ ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అధునాతనమైన అంగులతో లైబ్రరీని పాఠకులకు సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద ప్రారంభించనున్నట్లు వీటితోపాటు మనకు సరిపడా మంచినీటి సౌకర్యమును 34 కోట్లతో ప్రారంభించడం జరుగుతుందన్నారు. వనపర్తి జిల్లాను రాష్ట్రంలోనే తలమాణికంగా నిలుపుతున్న వనపర్తి అభివృద్ధి ప్రదాత మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఫిషరీస్ కళాశాల, నర్సింగ్ కళాశాల, కళాశాల ఆడిటోరియం, వేస్టేజ్ మార్కెట్, పాలిటెక్నిక్ కళాశాలకు మరమ్మతులకు నిధులు, విశాలమైన రోడ్ల నిర్మాణం అనేకమైన పనులకు నూతన వరుడిని సృష్టిస్తున్న ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డికి , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 29న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు యువకులు వృద్దులు మహిళా సంఘాలు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News