Saturday, November 15, 2025
HomeTop StoriesIndiramma Indlu: అలర్ట్.. ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు: మంత్రి పొంగులేటి

Indiramma Indlu: అలర్ట్.. ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు: మంత్రి పొంగులేటి

Minister Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాలుగు విడతలుగా అందజేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్‌హెచ్ఎల్) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని అన్నారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్‌లో మాత్రమే మార్పులు జరుగుతాయని తెలిపారు. అంతేతప్పా లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం పొంగులేటి చేశారు.

- Advertisement -

పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్‌మెంట్ వరకూ నిర్మాణం పూర్తయితే రూ.1 లక్ష, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో రూ. 1 లక్ష విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. అలాగే.. ప్రస్తుతం రూఫ్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చే రూ.2 లక్షల బిల్లు విషయంలోనే మార్పు చేసినట్టుగా మంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని రూ.1.40 లక్షలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1.40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. మిగిలిన రూ.60 వేలను లబ్ధిదారుల ఖాతాల్లో ఉపాధి హామీ పథకం కింద అందజేస్తామని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత మిగిలిన లక్ష రూపాయలను విడుదల చేయనున్నట్టుగా పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం రీత్యా.. ఈ మార్పులు అనివార్యం అయ్యిందని అన్నారు. లబ్ధిదారులు ఈ మార్పును గమనించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-aadhaar-operators-hacking-scare-login-alerts/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad