Sunday, October 6, 2024
HomeతెలంగాణMinister Ponguleti launched Teluguprabha calendar: 'తెలుగుప్రభ' దినపత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన మంత్రి...

Minister Ponguleti launched Teluguprabha calendar: ‘తెలుగుప్రభ’ దినపత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తెలుగుప్రభ యాజమాన్యం, మంత్రి సిబ్బందికి శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో ‘తెలుగుప్రభ’ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్-2024, డైరీలను తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార, ప్రజాసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. పత్రికలెప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా బాధ్యతలు నిర్వహించాలని, ఈ బాధ్యతలను తెలుగుప్రభ దినపత్రిక సక్రమంగా నిర్వహిస్తోందని కొనియాడారు. క్యాలెండర్-డైరీల ఆవిష్కరణల సందర్భంగా తెలుగుప్రభ యాజమాన్యం, పత్రిక సంపాదకవర్గానికి, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో ఆరో రియాలిటీ (అరవిందో రియాల్టీ) వైస్ ఛైర్మన్ నాగులంచ శ్రీనివాస రావు, ‘తెలుగుప్రభ’ ఎడిటర్ సమయమంత్రి చంద్రశేఖర శర్మ, నెట్వర్క్ ఇంఛార్జ్ గౌతం, సర్కులేషన్ ప్రతినిధి ఆయన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News