Friday, November 8, 2024
HomeతెలంగాణMinister Ponnam in BC meeting: తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విసృత...

Minister Ponnam in BC meeting: తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విసృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం

పొన్నం రివ్యూ..

బంజారాహిల్స్ కొమురంభీమ్ భవన్ లో తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విసృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి,గురుకుల సెక్రటరీ సైదులు , ఎంబీసీ కార్పోరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, అడిషనల్ డెరైక్టర్ చంద్ర శేఖర్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయి బ్రాహ్మణ ఎండీ ఇందిరా ,బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , టాడి టాపర్ కార్పోరేషన్ ఎండీ ఉదయ్ కుమార్, డిబిసిడివొస్, ఏడిబిసిడివొస్, ఆర్సివోస్, డిసివోస్, ప్రిన్సిపల్స్ ,హాస్టల్ వార్డెన్..

బీసీ సంక్షేమ శాఖలో కింది స్థాయి నుంచి పై వరకు అధికారుల పనితీరుపై సమీక్షా..

గురుకుల తాజా పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి పొన్నం ఆతరువాత..క్షేత్ర స్థాయిలో హాస్టల్ ,గురుకులాలు ఎదుర్కుంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కింది స్థాయి నుండి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన లో విద్యా కు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే పాఠశాలలో 1100 కోట్లతో 25 వేల స్కూల్ లకు మౌలిక సదుపాయాలు కల్పించామని,

గత 10 సంవత్సరాలుగా బదిలీలు , ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయ లోకానికి 19 వేల ప్రమోషన్లు ,35 వేల బదిలీలు చేపట్టామన్నారు. ప్రతి స్కూల్ కి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు మంత్రి వివరించారు. శానిటేశన్ కి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, గత దశాబ్ద కాలంగా నిరుత్సాహం లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్లకు కూడా బదిలీలు చేపట్టామని చెప్పారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూల్ లో 9 వేల నియామకాలు చేపట్టామని, కొత్తగా నియామకాలు అయినా వారిని కూడా ఎలాంటి పైరో లేకుండా బదిలీలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు మంత్రి.

నిన్ననే డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్
కాంప్లెక్స్ భవనాల నమూనా విడుదల చేశారని, ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉన్న మాదిరి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 11 న శంఖు స్థాపన చేసుకుంటున్నామని, ఈ సంవత్సరానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాలకు 5 వేల కోట్లు కేటాయించామని పొన్నం వివరించారు. గురుకుల పాఠశాలలకి రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని, గురుకులల్లో స్పోర్ట్స్ ,కల్చరల్ యాక్టివిటీస్ పెంచాలని ఆదేశించారు. మీ దగ్గర నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్న మంత్రి, అధికారుల పనితీరు మెరుగుపడాలన్నారు,.

రాష్ట్రంలో గురుకులాల్లో 98 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందని, 326 గురుకుల పాఠశాలలో 21 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.. మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. దసరా లోపు వాటి 50 శాతం అద్దెలు చెల్లిస్తాం.. వెంటెన్ మౌలిక సదుపాయాలు కల్పించేలా యాజమానులతో మాట్లాడాలన్నారు. గురుకులాల్లో చెత్త, గడ్డి లేకుండా ఉండడానికి ఉపాధి హామీ ద్వారా శుభ్రపరచాలనీ కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. క్షేత్ర స్థాయిలో మీరు ఎదుర్కుంటున్న సమస్యలు మా దృష్టికి తీసుకురావాలన్నారు. అధ్యాపకులు నిరంతరం శ్రనిస్తున్నారను పేరు తెచ్చుకోవాలని, ఈనెల 9 వ తేదిన డీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్నామని పొన్నం తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News