10 నవంబర్ 2023 రోజున రాహుల్ గాందీ గారి మాట ప్రకారము కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దిరామయ్య గారి సమక్షంలో కామారెడ్డి బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తేది. 4 ఫిబ్రవరి 2024 రోజున జరిగిన మంత్రి మండలి నిర్ణయము మేరకు మొత్తము తెలంగాణ రాష్ట్రములో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది, రాజకీయ మరియు కులాల సర్వే (కుల గణన)) చేపట్టాలని ఈ క్యాబినెట్ తీర్మానించింది.
రాష్టములో వెనుకబడిన తరగతుల, ఎస్‌సి&ఎస్‌టి పౌరులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది రాజకీయ అవకాశాలను ప్లాన్ చేసి అమలు చేయడానికి గాను తేది. 16 ఫిబ్రవరి 2024 రోజున శాసన సభలో ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.
ఇట్టి తీర్మానమునకు అనుగుణముగా జి.ఓ.ఏంయెస్. నెం. 26, తేది. 15.3.2024 ప్రకారము కుల గణన చేయుటకు గాను తెలంగాణ బి.సి. కమీషన్ యొక్క తీర్మానము క్రమము బి.సి. సంక్షేమ శాఖ ద్వారా 150 కోట్ల రూపాయలను విడుదల చేయడము ప్రక్రియ ప్రారంభము జరిగింది.
కులగణన చేయుటకు గాను జి.ఓ.ఏంయెస్. నెం. 199, తేది. 06.09.2024 రోజున శ్రీ నిరంజన్ ఛైర్మన్ గా మరియు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి గార్లను మెంబర్స్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటము జరిగినది.
తెలంగాణ రాష్ట్రములో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాడి, రాజకీయ మరియు కులాల సర్వే) కులగణన చేయుటకు గాను జి.ఓ.ఏంయెస్. నెం. 18, తేది. 10.10.2024 ద్వారా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ను నోడల్ డిపార్ట్ మెంట్ గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీచేయడమైనది.
తేది: 6.11.2024 నుండి 85,000 మంది ఎన్యూమరేటర్లు ప్రతి 10 మంది ఏనుమరేటర్లకు ఒక పరిశీలకుడుగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్టాఈ అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటికి సమగ్ర సమాచార సేకరణ చేసి డాటా ఎంట్రీ చేయడముతో పాటుగా 30 నవంబర్ లోపు ఈయొక్క సమాచార సేకరణ పూర్తి చేయాలని ప్రణాళికలతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమమునకు ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. దేశములో తొలిసారిగా మరియు రాష్ట్రములో రాహుల్ గాందీ గారి మాట ప్రకారము జరుగుతున్న ఈ సర్వేను ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ సర్వే రాబోయే కాలములో అన్ని రకాల పథకాలు అందుటకు మరియు ఇది ఒక మెగా హెల్త్ చెకప్ లాగా సమాచారముతో పాటుగా భవిష్యత్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది కావునా తప్పకుండా ప్రతి ఒక్కరూ సమాచారము సేకరిస్తున్న వారు మరియు సమాచారము తెలుపుతున్న ప్రతి తెలంగాణ బిడ్డ ఈ యొక్క సర్వే లో భాగస్వాములై సహరించాలని కోరుతున్నాను.