Ponnam Prabhakar: ప్రధాన పత్రికలతో పోటీపడుతూ పత్రిక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు ప్రభ దినపత్రిక మరో అడుగు ముందుకేసి ‘1056/90 ఒక విధ్వంసం’ అనే పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇలాంటి పుస్తకాలు తీసుకురావడం ఆ పత్రిక యాజమాన్యానికే సాధ్యమవుతుందని కొనియాడారు. తెలుగు ప్రభ దినపత్రిక ఎండీ సమయమంత్రి చంద్రశేఖర శర్మ రచించిన ఒక విధ్వంసం 1056/90 అనే పుస్తకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో గోల్లె రామస్వామి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పత్రికలతో తెలుగు ప్రభ దినపత్రిక పోటీ పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా 16 పేజీలతో సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక సంచికను రూపొందించడం అభినందనీయమన్నారు. పఠాన్ చెరువు కాలుష్యంపై సమగ్రమైన వివరాలతో పత్రిక ఎండి చంద్రశేఖర శర్మ 1056/90 ఒక విధ్వంసం అనే పుస్తకాన్ని రూపొందించిన తీరు చాలా బాగుందని ప్రశంసించారు. తెలుగు ప్రభ దినపత్రిక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్రను పోషించాలని మంత్రి పొన్నం సూచించారు.