Ponnam prediction on Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నువ్వా నేనా అన్నట్టుగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగుతున్నారు. అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వచ్చే ఫలితంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో.. ప్రిడిక్షన్ చేశారు. బీజేపీకి ఎన్ని ఓట్లు పడతాయో చేప్పేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్‌తో కుమ్మకైయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ పార్టీ ప్రచార సరళిని మొత్తం దింపుడు గళ్లం ఆశలాగా మార్చారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ వ్యవస్థను మొత్తం బీఆర్ఎస్2కి హ్యాండోవర్ చేశారని ఆరోపణలు గుప్పించారు. అనధికారికంగా బీజేపీ ఓటమిని ఒప్పుకున్నట్లేనని మంత్రి పొన్నం అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థికి 10 వేల కంటే ఎక్కువ ఓట్లు దాటవని అన్నారు. ఇది తన ఛాలెంజ్ అని మంత్రి పొన్నం అన్నారు. మీరు గత ఎన్నికల్లో వారి మద్దతు తీసుకొని దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి లోపాయికారిగా మద్దతు తెలుపుతున్నట్లుగా జూబ్లీహిల్స్‌లో చర్చ జరుగుతోందని అన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/kishan-reddy-comments-on-cm-revanth-reddy/
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తన ఎంపీ స్థానంలోని జూబ్లీహిల్స్నియోజకవర్గానికి ఈ పదేళ్లలో ఏం చేశారో …బీజేపీ పేద్దలు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైన నిజాయితీగా ఓటమిని ఒప్పుకోండని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి పొన్నం అన్నారు. మీ అభ్యర్థిని మోసం చేయకుండా.. నిజాయితిగా పని చేయమని రాజసింగ్ చెప్తున్నట్టుగా కిషన్ రెడ్డి నడుచుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం పక్కా అని మంత్రి పొన్నం అన్నారు.


