Ponnam Prabhakar on Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ గెలిచి తీరుతామని తెలిపారు. అభివృద్ధికి బాటలు వేస్తున్న కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
మా ప్రభుత్వం జోడెద్దుల బండి: సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పొన్నం శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్‌లో రూ.2.16 లక్షలతో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.54 లక్షలతో మురుగు నీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేసినట్లు పొన్నం పేర్కొన్నారు. దాని పక్కనే ఉన్న స్థలంలో పార్కును సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి పనులు ప్రారంభం అవుతాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి, తదితర ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/hydra-demolishes-illegal-constructions-in-kondapur/
అభివృద్ధి బాధ్యత మాదే: హైదరాబాద్‌లో 60 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. నగర ప్రజలు చాలా తెలివైన వారిని తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మాత్రమే ప్రజలు పట్టం కడతారని అన్నారు. జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేసే బాధ్యత ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్నారని నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని స్థానిక ప్రజలను కోరారు.


