Friday, November 22, 2024
HomeతెలంగాణMinister Seethakka : బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ కుట్ర

Minister Seethakka : బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ కుట్ర

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా ప‌నిచేస్తోందని మరోసారి మంత్రి సీతక్క (Minister Seethakka ) ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోందని ఆరోపించారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బిజెపితో బీఆర్ఎస్ అంట‌కాగుతోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చిన నాటి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో బీఆర్ఎస్ విష ప్ర‌చారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హిళ‌ల ఉచిత ప్ర‌యాణ ప‌థ‌కంపై దుష్ప్రచారం చేస్తూ… ఆటో డ్రైవర్లను ఉసి గొలిపి ధర్నాలు చేయిస్తున్నారన్నారని ఆరోపించారు. ఓలా, ఉబ‌ర్ క్యాబ్లు, బైక్ లు తెచ్చిన‌ప్పుడు ఆటో డ్రైవ‌ర్లు గుర్తుకు రాలేదా? అని బీఆర్ఎస్ ని ప్రశ్నించారు.

Also Read : దుద్యాల ఘటనపై హరీష్ రావు ఫైర్

పంట రుణ‌మాఫీని చేయ‌ని బీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపించ‌డం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సీతక్క (Minister Seethakka). “బీఆర్ఎస్ ఎన్నో హ‌మీలిచ్చి మోసం చేసింది. కానీ ఆ పార్టీ నేతలు ఇప్పుడు ట్విట్టర్లో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారన్నారు. కేటీఆర్ ట్విట్టర్ టిల్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారన్న సీతక్క… బీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌రన్నారు. పంచాయ‌తీ భ‌వ‌నం తాక‌ట్టు అని హ‌రీష్ రావు ప్ర‌చారం చేయ‌డం స‌రికాదని సీతక్క మండిపడ్డారు. ఇంటింగి స‌మ‌గ్ర స‌ర్వేను బ‌హిష్క‌రించ‌డం అంటే మన హక్కులను, అభివృద్దిని వదులుకోవడమే అవుతుందని వెల్లడించారు. సర్వే వద్దనుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించుకోవాలని మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News