Thursday, March 27, 2025
HomeతెలంగాణSeethakka: అనాథలకు రెస్టారెంట్ లో ఆతిథ్యం

Seethakka: అనాథలకు రెస్టారెంట్ లో ఆతిథ్యం

డిన్నర్

సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సుకోసం వినియోగించాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవ భావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. చిన్ననాటి ఉంటే పిల్లల్లో పెద్దలపట్ల సమాజం పట్ల ఎలా నడుచుకోవాలి నేర్పించాలని హితవు పలికారు.

- Advertisement -

బార్బిక్యూలో డిన్నర్

హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ASF BBQ & గ్రిల్ రెస్టారెంట్ లో ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చిన్నారులతో పాటు మంత్రి పాలుపంచుకొని వారిలో ఆనందాన్ని నింపారు.

సంపాదించిన దాంట్లో కొంత

సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు కాడ అఖిల్ & ఆరిఫ్ అలీ అన్నారు. చిన్నారుల్లో ఆనందం నింపడమే వన్ ఈవెనింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్ కార్యక్రమం పేర్కొన్నారు. ఎన్జీవో చెందిన 70 మంది చిన్నారులకు ఆహార అందించడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News